ధన్వాడ మండలంలో ముదిరాజుల సమావేశం
ధన్వాడ మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ దగ్గర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నీరటి నరసింహనాయుడు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ యువత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆంజనేయులు ముదిరాజ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ కుల గణనలో ముదిరాజ్ బంధువులందరూ వృత్తి దగ్గర మత్స్యకారులమని, కులం ఆప్షన్ దగ్గర ముదిరాజ్ అని నమోదు చేయించాలన్నారు.