కార్తికేయ-2కు జాతీయ అవార్డు.. ఆనందం వ్యక్తం చేసిన నిఖిల్‌

64చూసినవారు
తాను హీరోగా నటించిన ఈ సినిమా జాతీయ స్థాయిలో సత్తా చాటడంపై నిఖిల్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మన ‘కార్తికేయ 2’ జాతీయ అవార్డుకు ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఈ విజయానికి కారణం చిత్ర బృందం. నిర్మాతలు, దర్శకుడు చందూ, హీరోయిన్‌ అనుపమ, డీవోపీ కార్తిక్‌ ఘట్టమనేని.. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్