నీట్-పీజీ ప్రశ్నపత్రం లీకు వార్తలు ఫేక్: NBEMS

51చూసినవారు
నీట్-పీజీ ప్రశ్నపత్రం లీకు వార్తలు ఫేక్: NBEMS
నీట్-పీజీ ప్రశ్నపత్రం లీకైందంటూ కొందరు ‘విలువల్లేని ఏజెంట్లు’ చేస్తున్న వాదనలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తోసిపుచ్చింది. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. ‘నీట్-పీజీ లీక్డ్’ పేరిట ఉన్న టెలిగ్రామ్ ఛానల్‌లో ఇటువంటి తప్పుడు వాదనలను గుర్తించినట్లు తెలిపింది. అటువంటి సమాచారం చూసి నీట్-పీజీ అభ్యర్థులెవరూ మోసపోవద్దని సూచించింది. ఇప్పటివరకు ప్రశ్నాపత్రాన్ని రూపొందించలేదని పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్