విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. యువ రైతు బలి (వీడియో)

84చూసినవారు
TG: సూర్యాపేట జిల్లాలో విద్యుత్తు శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆత్మకూర్ (S) మండలం పిపానాయక్ తండా గ్రామపంచాయతీలోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్తు తీగలు కింది నుంచి పోతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కరెంటు తీగ తగిలి పొలంలోనే సోమవారం ఓ యువ రైతు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న అధికారులు కరెంట్ నిలిపివేశారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్