దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం నుంచి నిర్మాణరంగ పనులు, డీజిల్ జనరేటర్లపై నిషేధం అమలు చేయనున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు(గ్రాప్) రెండో దశ పనుల్లో భాగంగా అక్కడి ఆప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో తాజాగా వాయు నాణ్యత 301-400 పాయింట్ల మధ్య పడిపోవడంతో గ్రాప్ రెండో దశ చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు. గ్రాప్-2లో భాగంగా రోడ్లను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయడంతో పాటు రోడ్లపై దుమ్ము లేవకుండా నీళ్లు చళ్లనున్నారు.