పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త ఏటీసీలు.. సీఎం ఆదేశాలు

64చూసినవారు
పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త ఏటీసీలు.. సీఎం ఆదేశాలు
తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు CM రేవంత్ సూచించారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక సమర్పించాలని అన్నారు. రాష్ట్రంలో కనీసంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్యం అందించే ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలు స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధివిధానాలను రూపొందించాలన్నారు.

సంబంధిత పోస్ట్