TG: పెట్టుబడులు ఆకర్షించే విధంగా జనవరి 9న నూతన ఇంధన విధానాన్ని ప్రకటించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎనర్జీ పాలసీతో పాటు రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన అంశాలను అధ్యయనం చేసి నూతన విధానాన్ని రూపొందించినట్లు భట్టి తెలిపారు. తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్, ఇతర పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు భట్టి నియామక పత్రాలు అందజేశారు.