మే 7న యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్‌లు

55చూసినవారు
మే 7న యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్‌లు
యాపిల్ సంస్థ మే 7న కొత్త ఐప్యాడ్‌లు విడుదల చేయనుంది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్ లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. డిసెంబరు 30తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ఐప్యాడ్ల విక్రయాలు 25% తగ్గి 7.02 బిలియన్ డాలర్ల (సుమారు రూ.58,000 కోట్ల)కు పరిమితమయ్యాయి. కొత్త ఐప్యాడ్స్ విడుదలతో గిరాకీ పెంచుకోవాలని యాపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్