కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి FIR నమోదు

74చూసినవారు
కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి FIR నమోదు
దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల కింద తొలి FIR ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ఓవర్‌బ్రిడ్జి పక్కనే విక్రయాలు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిపక్షాలు అభ్యంతరం చేసినప్పటికీ కొత్త చట్టాలను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్