బాసర గోదావరి నదిలో పుణ్యస్నానాలు
కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో బాసరలోని గోదావరి నది వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేస్తూ కార్తిక దీపాలు వదులుతున్నారు. అనంతరం సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ఆలయం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో గోదావరి నది తీరం కిటకిటలాడుతోంది.