బాసర మండల కేంద్రం లో సోమవారం కొండ చిలువ కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక స్వాధ్యాయ కేంద్రం ఎదుట ప్రధాన రోడ్డుపై కొండ చిలువ కనిపించడంపై స్థానికులు పరుగులు తీశారు. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వగా చాకచక్యంగా పట్టుకుని గ్రామ పంచాయతీ చెత్త వాహనంలో సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.