కడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం కడెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దేవునిగూడెం గ్రామానికి చెందిన సతీశ్, అతడి స్నేహితుడు బైక్ పై కడెం నుంచి దేవునిగూడెం వెళ్తుండగా పాండ్వాపూర్ చెక్ పోస్ట్ వద్ద బారీకేడ్లు తగిలి అదుపుతప్పి కిందపడి గాయలైనట్లు తెలిపారు. గాయపడ్డ సతీశ్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.