కడెం మండలంలోని కల్లెడకు చెందిన కొక్కుల సత్తన్న, సుమలతల కుమారుడు మన్విత్ (6) జ్వరంతో బాధపడుతూ సోమవారం మరణించినట్టు గ్రామస్థులు, బంధువులు తెలిపారు. వారంనుంచి జ్వరంతో బాధపడుతుండగా తీవ్రత పెరగడంతో మూడు రోజులక్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డెంగ్యూ జ్వరంగా నిర్ధారించారని, పరిస్థితి విషమించి మరణించాడని సమాచారం.