ఖానాపూర్ మండలం - Khanapur Mandal

ఎండిపోతున్న పంటలను కాపాడిన భారీ వర్షం

ఎండిపోతున్న పంటలను కాపాడిన భారీ వర్షం

ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఎండిపోతున్న పంటలను భారీ వర్షం పడింది. వానాకాలం సీజన్ కావడంతో నియోజకవర్గంలోని కడెం, సదర్ మార్ట్ ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులు ఎక్కువగా వరి పంటను సాగు చేస్తారు. దీనికోసం వారు పొలాల్లో వరి నారును పెంచుతున్నారు. అలాగే మిగిలిన మండలాల్లో కూడా రైతులు వరితో పాటు పత్తి, కంది, సోయా, జీలుగు, జనుము, తదితర పంటలను సాగు చేశారు. అయితే నియోజక వర్గంలో దాదాపు 27 రోజులుగా వర్షపాతం నమోదు కాలేదు. దీంతో రైతులు వేసిన వరి నారుతో పాటు మిగిలిన పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. రాత్రి ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో భారీ వర్షం పడింది. దీంతో ఎండిపోతున్న పంటలకు భారీ వర్షం ప్రాణం పోసిందని ఆయా మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని, దీంతో పంటలను కాపాడుకోవడం వీలవుతుందని వారు తెలిపారు.