భైంసా మండలం మహాగం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లను శుక్రవారం భైంసా గ్రామీణ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఉచిత బస్సు స్కీంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.