ఆశ్రమ పాఠశాలల్లో అన్ని రకాల మరమ్మత్తులను నెలాఖరులోపు పూర్తి చేయాలని ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్త ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఐటిడిఏ కార్యాలయంలో ఐటిడిఏ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన భవనాలు, రోడ్లు, మరుగుదొడ్ల మరమ్మతులను డిసెంబర్ నెలాఖరులోపు పూర్తిచేసేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు.