ఉట్నూరులో సిపిఎం నాయకుల ప్రచారం

51చూసినవారు
ఉట్నూరులో సిపిఎం నాయకుల ప్రచారం
ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరుతూ సిపిఎం నాయకులు ఉట్నూర్ పట్టణంలోని అంగడి బజార్ ప్రాంతంలో ఎన్నికల ప్రకారం నిర్వహించారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం వారు ఉట్నూర్ పట్టణంలోని అంగడి బజార్ ప్రాంతంలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. సుగుణక్కకు ఉద్యమ చరిత్ర ఉందని, ఆమెను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పూసం సచిన్, తదితరులు ఉన్నారు.