కడెం ప్రాజెక్టు నీటి వివరాలను ప్రాజెక్ట్ అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 695 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 61 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ఎడమ కాలువకు 50, మిషన్ భగీరథకు 9, మొత్తం కలిపి 129 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు.