ఖానాపూర్‌లో ఎమ్మెల్యే బొజ్జు పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రతినిధులు గురువారం తెలిపారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని రాజీవ్ నగర్, విద్యానగర్ వీధుల్లో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ నిర్వహిస్తారని అన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా మండల పడిపూజలో పాల్గొంటారు. అంతరం ఇంద్రవెల్లి మండలంలోని ధనోరాబిలో కొమరం భీమ్ విగ్రహా ఆవిష్కరణలో పాల్గొంటారని తెలిపారు.