ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదురుగా సీఆర్టీ ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న సమ్మెకు బుధవారం సేవలాల్ సేన నాయకులు పాదయాత్రగా వచ్చి మద్దతు తెలిపారు. ఈసందర్భంగా సేవాలాల్ సేన నాయకుడు రాంబాబు మాట్లాడుతూ. ప్రభుత్వం సీఆర్టీ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. సీఆర్టీ ఉపాధ్యాయులకు సేవాలాల్ సేన ఎప్పటికీ అండగా ఉంటుందని వారి హక్కులను సాధించేవరకు పోరాటం ఆగదన్నారు.