తాసిల్దార్ కు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్తులు

298చూసినవారు
తాసిల్దార్ కు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్తులు
మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ సోమవారం మండల కేంద్రానికి చెందిన గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రభుత్వ భూముల లో ఇటువంటి అనుమతులు లేకుండా ఆలయాల జెండాలు ఏర్పాటుచేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే సేవాలాల్ జగదాంబ ఆలయాల జెండాలను ఏర్పాటు చేసి అల్లర్లకు ప్రయత్నాలు చేశారని ఇకనుండి ప్రభుత్వ భూములలో, ఆలయాల భూములలో గ్రామపంచాయతీకి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు సమాచారం అందించిన తర్వాతనే అనుమతులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల లో గ్రామ అభివృద్ధి కమిటీ నిధులతో రక్షణ కంచెను, ప్రభుత్వ భూమిని సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లో రేవిన్యు ఇన్స్పెక్టర్లు వెంకట నరసయ్య, గంగన్న గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్