లక్ష్మీనారాయణ ఆలయంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు
నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలం రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామికి పంచామృతాలతో అభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సహస్ర తులసి దళాలు లక్ష్మీనారాయణ స్వామికి అర్చించడం జరిగింది. స్వామివారికి పుష్పాలతో అష్టోత్తర పూజ గావించడం జరిగింది. ఫలాలను నివేదించడం జరిగింది. ఆలయ పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.