విద్యుత్ సబ్ స్టేషన్ ముందు గ్రామస్థుల ఆందోళన
నిర్మల్ జిల్లా మామడ మండలం వెంకటాపుర్ గ్రామానికి ప్రతి రోజు రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆదివారం రాత్రి ఖానాపూర్ మండలంలోని మేడంపెల్లి సబ్ స్టేషన్ ముందు ఆ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ప్రతి రోజు తమ గ్రామానికి రాత్రి వేళల్లో విద్యుత్ అధికారులు కావాలనే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.