జీపీఎస్‌ ట్రాకర్‌తో భద్రాద్రి జిల్లాలో రాబందు సంచారం (వీడియో)

66చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చిన 'గూఢచార రాబందు' సంచారం కలకలం సృష్టించింది. కెమెరా, జీపీఎస్ ట్రాకర్‌తో ఉన్న ఈ రాబందు చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం సమీపంలోని గుట్టపై వాలింది. అక్కడే చాలాసేపు ఉండిపోయింది. అలసిపోయి ఉన్న రాబందును గమనించిన స్థానికులు దానికి కోడి మాంసం, నీటిని అందించారు. ఆకలి తీర్చుకున్న రాబందు కాసేపటికి ఎగిరి వెళ్లిపోయింది. ప్రస్తుతం రాబందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్