ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శనివారం కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆయనకు ఆలయ అర్చకులు అమ్మ వారి హారతులతో పాటు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. ఆయనతో పాటు మండల నాయకులు తదితరులు ఉన్నారు.