నిర్మల్: బాసర మండలం శివాజీ చౌక్ దగ్గర ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో స్వాతి ప్రియకు బుధవారం నివాళులు అర్పించడం జరిగింది. ఎన్ఎస్యూఐ బాసర మండల అధ్యక్షుడు సుద్దల గంగా ప్రసాద్ మాట్లాడుతూ స్వాతి ప్రియ ఆత్మహత్య చేసుకోవడం మమ్మల్ని తీవ్రంగా కలిచి వేసిందని ఆయన అన్నారు. విద్యార్థులు ఎవరైనా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రతిదానికి ఆత్మహత్య సమాధానం కాదని ఆయన అన్నారు.