కారు అద్దాలు పగలగొట్టి రూ. లక్ష 80 వేలు చోరీ చేసిన ఘటన బుధవారం భైంసా పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం. లోకేశ్వరం మండలం గాడ్చందాకు చెందిన అల్లం భోజన్న ఎస్బీఐ బ్యాంక్ నుండి రూ. 90 వేలను విత్ డ్రా చేశాడు. మరో రూ. 90 వేలు బ్యాగ్లో ఉన్నాయి. మొత్తం లక్షా 80 వేలు కారులో ఉంచగా గమనించిన దుండగులు కారు అద్దాలు పగలగొట్టి బ్యాగులో ఉన్న డబ్బులు ఇతర వస్తువులను దొంగిలించినట్లు తెలిపారు.