భైంసా మండలం చుచుంద్ గ్రామంలోని సిద్ధేశ్వర ఆలయంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా పలువురు మహరాజు భక్తిమార్గంపై భక్తులకు మార్గదర్శనం చేశారు. భక్తులు తులసీమాలలు ధరించి భక్తిమార్గంలో నడవాలన్నారు. ప్రతీఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతియేటా కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో జాతర ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.