నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్లో బుధ, గురువారం రెండు రోజులు క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం క్రిస్మస్, గురువారం బాక్సింగ్ డే సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు ఉండడంతో భూసార బీట్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, కమిషన్ దారులు, ఖరీదు దారులు గమనించి సహకరించాలని కోరారు.