భైంసాలోని నాగదేవత ఆలయంలో జరిగిన చోరి ఘటన కేసును పోలీసులు పరిష్కరించారు. గురువారం ఎస్పీ డా. జానకీ షర్మిల కేసు వివరాలను వెల్లడించారు. మండలంలోని చుచుంద్కు చెందిన విశాల్, సంఘ రతన్ ఇద్దరు స్నేహితులు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయంలో చోరి చేశారు. హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా 48 గంటల్లో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.