గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్ఐ

62చూసినవారు
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్ఐ భాస్కర చారి సూచించారు. శుక్రవారం కుంటాల మండల కేంద్రంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎజాజ్ హైమాద్, ఎంపిడిఓ రహీం, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్