నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 3 నుంచి జరిగే నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ మంగళవారం బాసర ఆలయ ఈఓ విజయరామారావు, వైదిక బృంద సభ్యులు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సీతక్కను హైదరాబాద్లో కలిసి ఆహ్వాన పత్రి కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.