ముధోల్ నియోజకవర్గానికి హైడ్రా రప్పించి భూ కబ్జాదారుల భరతం పట్టాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ సభ్యులు మంగళవారం భైంసా ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు, భూకబ్జాలు చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇందులో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్లు దత్తు సింగ్, సాప పండరి, సాయినాథ్, తదితరులు ఉన్నారు.