కుబీర్: 23 నుంచి తగ్గనున్న సీసీఐ పత్తి ధరలు

75చూసినవారు
కుబీర్ మార్కెట్ లో ఈ నెల 23 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్ల ధరలు తగ్గనున్నాయి. ఇదివరకు క్వింటాలు పత్తి ధర రూ. 7, 521 ఉండగా పత్తి పింజం పొడవు తగ్గిన నేప థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి గంగన్న ఒక ప్రకటనలో తెలిపారు. క్వింటాలు మద్దతు ధర రూ. 7, 471 తో కొనుగోళ్లు జరుగుతాయని గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. కావున రైతులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్