ఘనంగా మహాత్మాజ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

1097చూసినవారు
ముధోల్ మండల కేంద్రంలో మహాత్మాజ్యోతిరావు పూలే జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో మాజీ సర్పంచ్ రాజేందర్ పాల్గొని నివాళులర్పించారు. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్నివర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేశారన్నారు.

సంబంధిత పోస్ట్