‘బడ్డీ’ మూవీ ప్రమోషన్స్‌లో అల్లు శిరీష్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అన్నయ్య బన్నీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘తన సినిమాలను ప్రమోట్ చేయమని అన్నయ్యను అడగడం ఇష్టం ఉండదు. నాప్రాజెక్ట్ ప్రమోషన్స్ కోసం తనని సంప్రదించకూడదని పాలసీ పెట్టుకున్నా. ఎందుకంటే నా వెనుక ఉండి ప్రమోట్ చేస్తున్నాడనే భావన ప్రేక్షకులకు కలుగుతుందనిపించింది’ అని వెల్లడించారు.