సెమిఫైనల్ చేరుకున్న ముధోల్ గానకోకిల అంజలి

78చూసినవారు
సెమిఫైనల్ చేరుకున్న ముధోల్ గానకోకిల అంజలి
ముధోల్ కు చెందిన ఓ పాఠశాల విద్యార్థిని అంజలి గడ్పాలే మహారాష్ట్రలోని ప్రసిద్ధ మరాఠి ఛానల్లో నిర్వహిస్తున్న మీ హోనార్ సూపర్ స్టార్ షోలో తన ప్రతిభతో ప్రతి ఒక్కరిని అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంగీత షోలో ఏకంగా సెమిఫైనల్ కు ఎంపికైంది. అంత పెద్ద వేదికపై తమ పాఠశాల విద్యార్థిని సెమీఫైనల్ కి ఎంపికవ్వడం గర్వకారణమని ప్రధానోపాధ్యాయులు సాయినాథ్ తో పాటు యాజమాన్యం, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్