ముథోల్ మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపులే బీసీ సంక్షేమ పాఠశాల విద్యార్థులు నిర్మల్ జిల్లా చెకుముఖి టాలెంట్ టెస్ట్ 2024లో కె. మంజూష 8వ తరగతి, ఏ. సంకీర్తన 9వ తరగతి, ఎం. తేజశ్రీ పదవ తరగతి విద్యార్థులు ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్టు ప్రధానోపాధ్యాయులు అమృత గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.