గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుండి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ నుండి ప్రాజెక్టులోకి వచ్చే వరద నీరు పెరగడంతో ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు సోమవారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358. 70 మీటర్లు కాగా ప్రాజెక్టులో 358. 70 మీటర్లు నీటి మట్టం ఉంది. ప్రాజెక్టులోకి 547 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, దిగువకు 507 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.