కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భైంసా పట్టణ బిజెపి అధ్యక్షుడు మల్లేష్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బూత్ నంబర్ 139 లో బూత్ అధ్యక్షుడు కనకయ్య తో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్, ఫసల్ భీమా యోజన, గరీబి కళ్యాణ్, పీఎం విశ్వకర్మ యోజన తదితర పథకాలను ప్రజలకు వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.