ముధోల్ మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం సాయిమాధవ్ నగర్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ముధోల్ పోలీస్ స్టేషన్లో ఏర్పటు చేసిన మీడియా సమావేశంలో భైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్ వివరాలు వెల్లడించారు. వెంకటేశ్ కుటుంబంతో హైదరాబాద్ వెళ్లగా అతడి ఇంట్లో అద్దెకు ఉంటున్న భార్యాభర్తలు దొంగతనం చేసినట్లు తెలిపారు. వారి వద్ద 7 తులాల బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.