రైతుల స్వేచ్ఛ కోసమే వ్యవసాయ బిల్లు..
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లు రైతుల స్వేచ్ఛ కోసమేనని కేంద్ర విత్తన పరిశోధనా సంస్థ పాలకమండలి సభ్యులు అయ్యన్న భూమయ్య అన్నారు. ఆదివారం నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యవసాయ బిల్లును తీసుకొచ్చారని తెలిపారు. రైతుల ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఠాగూర్ అర్జున్, జిల్లా కార్యదర్శి మిట్టపల్లి రాజేందర్ రైతు మోర్చా మండల అధ్యక్షులు నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్, యువ మోర్చా మండల అధ్యక్షులు ప్రశాంత్, సోషల్ మీడియా కన్వీనర్ శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.