తెలంగాణలో ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC)కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రైవేటు ఏజెన్సీ ఈ పోర్టల్ ను నిర్వహించగా.. దాని గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన NICకి పోర్టల్ బాధ్య తలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ధరణిలో ఉన్న అప్లికేషన్ ఫీజులను తగ్గించనున్నట్లు వినిపిస్తోంది.