నిర్మల్ జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పేట్ గ్రామానికి చెందిన బోన్ల సింధుజ వృత్తి బీడీ కార్మికురాలు. అమ్మాయి పోయిన నెల 28 వ తేదీన నిర్మల్ పట్టణానికి బట్టలు కొనుక్కోవడానికి వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. తన ఆచూకీ కోసం ఎంత వెతికిన ప్రయోజనం లేకపోవడంతో అమ్మాయి సోదరుడు శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు.