దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లిలో ఇథనాల్ పరిశ్రమను తరలించాలని శనివారం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గ్రామం నుంచి నారాయణపేట జిల్లాలోని చిత్తనూరు ఇథనాల్ పరిశ్రమను చూసేందుకు వెళ్లిన గ్రామస్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పరిశ్రమను తరలించాలని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేపట్టారు. ప్రభుత్వం స్పందించకుంటే తీవ్ర ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.