ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

81చూసినవారు
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. రాజు (38) అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో భార్య దేవిక భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. రాజు బుధవారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా అతను చిన్నాన్న గమనించి భార్యకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్