సోన్: సంత్రా పండ్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా
సంత్రా పండ్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడ్డ ఘటన సోన్ మండలంలో శనివారం ఉదయం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు సంత్రా పండ్లతో వెళ్తున్న లారీ జాతీయ రహదారి కడ్తాల్ వద్ద బోల్తా పడింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, సంత్రా పండ్లను తీసుకోవడానికి అక్కడి జనాలు ఎగబడుతున్నారు.