కరీంనగర్ ఆఫ్ మారథాన్ లో పాల్గొన్న సోన్ ఎస్సై

74చూసినవారు
కరీంనగర్ ఆఫ్ మారథాన్ లో పాల్గొన్న సోన్ ఎస్సై
కరీంనగర్ జిల్లా కేంద్రంలో సైకిలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కరీంనగర్ ఆఫ్ మారథాన్ లో సోన్ ఎస్సై గోపి పాల్గొన్నారు. 3, 5, 10, 21 కిలోమీటర్ల రన్ లో పాల్గొని 21 కిలో మీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. యువత ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్