నిజామాబాద్ లో దొంగల భీభత్సం

10405చూసినవారు
నిజామాబాద్ లో దొంగల భీభత్సం
నిజామాబాద్ లో మరో సారి దొంగలు రెచ్చిపోయారు. నిజామాబాద్ పట్టణంలోని బంగారు దుకాణాల్లో చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. సోమవారం వేగువ జామున 3గంటల ప్రాంతలో ఈ చోరికి పాల్పడ్డారు. వినాయకనగర్ ప్రాంతంలోని సాయి తేజ, మహాలక్ష్మీ, చరణ్ బంగారు దుకాణాల్లోకి షటర్లు తొలగించి లోపలికి చొరబడిన దొంగలు 50 లక్షల రూపాయల విలువైన నగలు, నగదు పట్టుకెళ్లారు. పక్క ప్లాన్ తో వచ్చిన దుండగులు షాప్ ల్లోని సీసీ కెమెరాలను, హార్డు డిస్కులను ధ్వంసం చేశారు. అయితే చివరి దుకాణంలోని సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. డాగ్ స్క్వాడ్ టీంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలను భయాందోళనలకు గురౌతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్