ఆలూర్: వేయినామాల వెంకటేశ్వరస్వామి గుడిలో ముక్కోటి ఏకాదశి

79చూసినవారు
ఆలూర్: వేయినామాల వెంకటేశ్వరస్వామి గుడిలో ముక్కోటి ఏకాదశి
ఆలూర్ మండల కేంద్రంలోని వేయినామాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చాయి. పల్లకి సేవకు భక్తులు బారులు తీరారు. తులసిమాలలు, పలురకాల పువ్వులు సమర్పించి వెంకటేశ్వర స్వామివారిని వేడుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వేయి నామాల వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తామని వీడీసీ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్